Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపే సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం 

రేపే సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం 

- Advertisement -

ఎంపీడీవో కుమార్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని వివిధ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ మరియు సర్పంచ్ ప్రమాణస్వీకారం ఉత్సవ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల నూతన పాలకవర్గం ను ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు నూతన పాలకవర్గమునకు స్వాగతం పలికి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తారని అన్నారు. మొదటగా వార్డు సభ్యులను అందరిని కలిపి ప్రమాణ శ్రీకారోత్సవం చేపించిన తర్వాత ఉప సర్పంచ్ ను ప్రమాణస్వీకారం చేపిస్తారని అనంతరం ఆ గ్రామ సర్పంచ్ ను  ప్రమాణస్వీకారం చేపించి వారి వారి సీట్లలో కూర్చుండబెట్టి గ్రామ పరిపాలన పరమైన సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -