Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అచ్చంపేటలో తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు

అచ్చంపేటలో తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
తైక్వాండో అసోసియేషన్ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఆదివారం అచ్చంపేటలో షామ్స్ ఫంక్షన్ హాల్ లో తైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలు. నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఉదయం ప్రారంభించారు. సాయంత్రం వరకు పోటీలు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్,  నల్గొండ, నిజామాబాద్ అదిలాబాద్ నారాయణపేట గద్వాల  వివిధ జిల్లాల నుంచి 260 విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్, సిల్వర్ మెమొంటోలు,  సర్టిఫికెట్లను తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజు నాయక్, సామాజిక కార్యకర్త రాజు లు అందజేశారు. తైక్వాండో ద్వారా విద్యార్థి ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ శారీరిక ఆరోగ్యం, సమన్వయం ఆత్మ రక్షణను పెంపొందించుకుంటాడని సూచించారు. కార్యక్రమంలో తైక్వాండో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు బాలరాజు, కార్యదర్శి అబ్దుల్ సత్తార్, కోశాధికారి రాకేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -