Sunday, December 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
ప్రభుత్వ కళాశాలలో 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరుపుకున్నారు. గత మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తమకు కాలేజీ తో ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరిచారు సుమారు 35 మంది విద్యార్థులు ఆనందంగా కేక్ కట్ చేసి సంబరాలను  చేసుకొని ఈ స్థాయిలో ఉండడానికి ఆనాటి గురువుల అందించినటువంటి విద్యాభ్యాసమే కారణమని తమ గురువులను గుర్తు చేసుకున్నారు. కామర్స్ లెక్చరర్ మారుతి రావు ప్రభావం ఎక్కువగా ఉందని ఈ స్థాయికి రావడానికి కారణం అయినటువంటి ప్రతి ఒక్క లెక్చరర్ కి కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ విద్యార్థులందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు కళాశాల ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, విద్యార్థులు రాజేందర్, పవన్, సుభాష్, గంగారెడ్డి, కేశవ్, గణేష్ తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -