ఎన్.టి.ఆర్. స్టేడియం అనే పుస్తకంలో
స్టాల్స్ అనే పేజీలలో
కవిత్వమై విహరిద్దాం రండి
కవులు, కవయిత్రులతో
కరచాలనంచేస్తూ కలయ తిరుగుదాం రండి
తీయ తేనియ జ్ఞాపకాలను మనసును హత్తుకుని
నచ్చిన కవితలు తలకెత్తుకుని
మనసులో మననం చేస్తూ
పెదవుల భుజాలపై మోస్తూ
వీధివీధికి త్రిప్పుదాం రండి
భావాలను, పదాలను
వాక్యాల దారాలలో నింపుతూ
కవి సమయాలను కాలంతో ముడివేద్దాం
మెటాఫర్ లను మేళవించి
చర్చించుకుందాం రండి
కనిపించిన కవితా వస్తువులను
మార్పిడి చేసుకుందాం
ఆలోచనల లోచనాలతో సూక్ష్మంగా చూస్తూ
అడుగులో అడుగేస్తూ నడుద్దాం రండి
గుబాళించిన పుస్తకాల తావిని చవి చూసి
తుమ్మెదలై ఎగిరిపోదాం రండి
ఆకర్షించిన పుస్తకాలను అమాంతం ఎత్తుకుని
హృదయానికి దగ్గర చేసుకుని
మంచి సంగతులను నోటితో ఏరుకుందాం
కవిత్వమై విహరిద్దాం రండి
డా||బట్టు విజయ్ కుమార్, 9505520097
కవిత్వమై విహరిద్దాం రండి
- Advertisement -
- Advertisement -



