Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాణస్వీకారోత్సవాలకు డిజేలు వాడొద్దు.

ప్రమాణస్వీకారోత్సవాలకు డిజేలు వాడొద్దు.

- Advertisement -

కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్
నవతెలంగాణ – మల్హర్ రావు.

మండల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు,ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సోమవారం ఆయా కార్యక్రమాలను ప్రజలు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ,ప్రమాణ స్వీకార కార్యక్రమాలు వేడుకల సందర్భంగా డీజేలు, భారీ శబ్ద వ్యవస్థలు వినియోగించరాదని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్,ఎస్-2రాజన్ కుమార్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ర్యాలీలు, రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే చర్యలు చేపట్టరాదన్నారు. పోలీస్ నిబంధనలను అతిక్రమించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. కావున గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరూ పోలీస్ శాఖకు సహకరించి, శాంతియుతంగా ప్రమాణ స్వీకారోత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -