- Advertisement -
వరల్డ్ టూర్ ఫైనల్స్
హాంగ్జౌ (చైనా) : దక్షిణ కొరియా షట్లర్, వరల్డ్ నం.1 అన్‌సె యంగ్ చరిత్ర సృష్టించింది. బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో చైనా షట్లర్ వాంగ్ జి హిపై 2-13, 18-2, 21-10తో గెలుపొందిన యంగ్ సీజన్లో 11వ టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో యంగ్ ఈ ఏడాదిలో రికార్డు రూ.10 కోట్ల ప్రైజ్‌మనీ సాధించింది. ఓ సీజన్‌లో జపాన్ దిగ్గజం కెంటో మెమోట 11 టైటిల్స్ రికార్డును యంగ్ సమం చేసింది. పురుషుల సింగిల్స్‌లో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) 21-19, 21-9తో షి యుకి (చైనా)పై గెలుపొంది విజేతగా నిలిచాడు.
- Advertisement -



