- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ : మండల పరిధిలోని నాగపూర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ గా పోలేపల్లి హేమలత, ఉప సర్పంచ్ గా ఎంబరి నరసయ్య, వార్డు సభ్యులుగా పోలేపల్లి లక్ష్మీనారాయణ, మట విజయ, నల్లూరి కృష్ణవేణి, ఓరగంటి నవత, తంబురూ నర్సయ్య, రుక్సానా బేగం, బొమ్మిడిత నరేష్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి జె. వికాస్, కరోబార్ అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



