Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం

బస్వాపూర్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ ఎంపీయుపీఎస్ లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా జుక్కల్ లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీల కొత్త పాలకవర్గాలు, ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారులు తిరుపతయ్య, హెడ్ మాస్టర్ లాలయ్యలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు జైచంద్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించడం ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా పరిజ్ఞానాన్ని అందించిన వారమవుతామని అన్నారు. విద్యార్థులు పరిజ్ఞాన పుస్తకాలు చదివితే అవి వారికి ఎంతో మనోబలాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎంతో పాటు  పాఠశాల సిబ్బంది సుభాష్, మధుసూదన్, జై శ్రీ, రుక్సానా, రాందాస్ సార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -