Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు 

ఘనంగా శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
తెలంగాణ గిరిజన గురుకుల కళాశాలలో సోమవారం గణిత నిపుణులు శ్రీనివాస రామానుజన్ 138వ జన్మదిన పురస్కరించుకొని విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గణిత ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్  మాట్లాడుతూ.. వారి యొక్క జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత నిపుణులని కొనియాడారు. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ కాటారంలో జరిగిన మండల స్థాయి గణితము ప్రతిభా పరీక్ష నిర్వహణలో భాగంగా ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులు డి.సందీప్, బి.దిలీప్ లను కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆసనాడ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాములు, డిప్యూటీ వార్డెన్ రాజబాపు, సంపత్, స్వప్న, సంతోష్, నరేష్, శ్రీనివాస్, పద్మ, రాజు, సర్దార్సింగ్ భూక్య రాజు, రజిత, పీడీ కుడిమేత మహేందర్ పిఈటి మంతెన శ్రీనివాస్, కోచ్ మూల వెంకటేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -