కొత్త సర్పంచ్లు ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ – మల్హర్ రావు
అందుబాటులో ఉంటాం.. అభివృద్ధిలో గ్రామాలు అభివృద్ధి చేస్తామని కొత్త సర్పంచ్ లు అన్నారు. సోమవారం మండలంలోని 15 గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్సులచే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాము ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధిలో ముందుంటాంని చెప్పారు.గ్రామాభివృద్దే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిస్కారం కోసం నిరంతరం పని చేస్తామంటూ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి,ఈజిఎస్ రాష్ట్ర సభ్యుడు దండు రమేష్,తాజా మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు, జక్కు వెంకటస్వామి యాదవ్, పల్లెర్ల మధు, రాజ సమ్మయ్య, ప్రభాకర్,పైడాకుల సమ్మయ్య పాల్గొన్నారు.
అందుబాటులో ఉంటాం..అభివృద్ధి చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



