Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ ప్రాణాలు కాపాడటంలో సహాయపడుతుందన్నారు. మరీ ముఖ్యంగా నిరుపేదలకు కొండంత భరోసానిస్తుందన్నారు. ప్రస్తుతం పెరిగిన వైద్య ఖర్చులు పేదలు భరించలేకపోతున్నారని, వారందరికీ ఊరటగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి, వారి వైద్యానికి సహాయం అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేయలన్నారు. అలాగే పేదలకు రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా 10. లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తుందని, గోవిందరావుపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో 30 మంది లబ్ధిదారులకు రూ.12,90,500/- (పన్నెండు లక్షల తొంబై వేల ఐదు వందల రూపాయలు) చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, చల్వాయి గ్రామ అధ్యక్షులు వేల్పుగొండ ప్రకాష్, సర్పంచ్ జోగా నాయక్, గాంధీనగర్ సర్పంచ్ బానోత్ నిర్మల – వెంకన్న, లక్ష్మీపురం సర్పంచ్ లకావత్ జమ్మిలాల్, ఉపసర్పంచ్ పెండెం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -