– తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక
నవతెలంగాణ – రాయపోల్
రజక కులవృత్తిదారుల సంక్షేమం, హక్కుల సాధన కోసం రజకులు ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక పిలుపునిచ్చారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మండల కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగబోయే తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాలుగో మహాసభకు రజకులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఐక్యతే బలం.. హక్కుల సాధనే లక్ష్యంగా రజకుల అభ్యున్నతి, సమాజ సంక్షేమం కోసం సమిష్టిగా ముందుకు సాగాలని అన్నారు.
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు నాలుగు మండల కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 26 మండలాల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నాలుగో మహాసభకు జిల్లా నలుమూలల నుంచి రజక నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, జిల్లా అధ్యక్షులు జంగాపల్లి ఐలయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దిటి రాజు, జిల్లా యూత్ అధ్యక్షులు చింతకింది కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం రాయపోల్ మండల నూతన కమిటీ ప్రకటించారు. అధ్యక్షులు వడ్లకొండ బిక్షపతి, యూత్ అధ్యక్షులు చాకలి రాము, ఉపాధ్యక్షులు చెప్యాల్ స్వామి, తిమ్మరాజు నరసయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్. కృష్ణ, ప్రధాన కార్యదర్శి పరికిబండ మల్లేశం, కార్యదర్శి నవీన్, సంయుక్త కార్యదర్శి రాచకొండ రవి, కోశాధికారిగా పీర్లపల్లి సాయికుమార్, మండల ఇన్‌చార్జి వడ్లకొండ నర్సింలు, మండల కన్వీనర్ కొట్టాల నర్సింలు లను నియమించారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసి నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలో రజక సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



