ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లకు అంగీకారం
సమస్యలపై ప్రభుత్వం సానుకూలం: టీజీజేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో టీజీజేఏసీ (తెలంగాణ ఉద్యోగ జేఏసీ) ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు (పెన్షనర్లు) ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నాలుగు కీలక డిమాండ్లపై అంగీకారం తెలిపిందని టీజీఈజేఏసీ వెల్లడించింది. జేఏసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం…ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా రెండు డీఏలను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలుపుతామని స్పష్టం చేసింది. ఈ నెలాఖరులోగా పీఆర్సీ నివేదికను తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకునే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనుంది. పెండింగ్ బిల్లుల చెల్లింపుల ప్రక్రియను మార్చి నాటికి పూర్తిగా పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలిపింది.నూతన పింఛను విధానాన్ని (సీపీఎస్) రద్దు చేసి, పాత పింఛను విధానం అమలుపై అధ్యయనం చేయడానికి మూడు నెలల కాలపరిమితితో కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే 01-09-2004 ఉద్యోగుల సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలం : టీజీజేఏసీ
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును టీజీజేఏసీ నిరంతరం పర్యవేక్షిస్తుందని మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో రేపు హైదరాబాద్‌లో జరగాల్సిన టీజీజేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని, అందువల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరూ రేపు హైదరాబాద్‌కు రావొద్దని వారు విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎంతో చర్చలు సఫలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



