Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభయపెట్టే ‘ఆదివారం’

భయపెట్టే ‘ఆదివారం’

- Advertisement -

జెఎస్ఆర్ క్రియేషన్స్ 999 బ్యానర్ పై సుబ్రమణ్యం చిగురుపాటి రచన, దర్శకత్వంలో జెఎస్ రాజా రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘ఆదివారం’. రఘు తేజ, సునీల్, తార, ఝాన్సీ ప్రముఖ పాత్రలు పోషిస్తుండగా విలాస్, అశోక్, సయ్యద్ మెహబూబ్ భాషా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా స్క్రిప్ట్ను దర్శకుడు సుబ్రమణ్యంకి నిర్మాత జెఎస్ రాజారెడ్డి అందచేయగా, కెఎస్ రామారావు క్లాప్ కొట్టారు. రామ సత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు సుబ్రమణ్యం చిగురుపాటి మాట్లాడుతూ, ‘మాకు సపోర్ట్ ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఓ మంచి కాన్సెప్ట్‌తో క్యాచీ టైటిల్‌తో మీ ముందుకు రాబోతున్నాం’ అని చెప్పారు. నిర్మాత జెఎస్ రాజారెడ్డి మాట్లాడుతూ, ‘గతంలో ఎన్ని హర్రర్‌ సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా పూర్తిగా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్ళి, సినిమాను మంచి విజయం చేసే ప్రయత్నం చేస్తాం’ అని నిర్మాత జెఎస్ రాజారెడ్డి తెలిపారు. ఈ సినిమాకి డిఓపి : సాకేత్, సినిమాటోగ్రఫీ : ఎస్ఎస్ వెంకటేష్, ఎడిటర్ : దువ్వరపు వెంకటేష్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -