Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకోటి.. లైవ్‌ కాన్సర్ట్‌

కోటి.. లైవ్‌ కాన్సర్ట్‌

- Advertisement -

సంగీత దర్శకుడు కోటి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 80, 90వ దశకంలో రాజ్ కోటి ద్వయానికి ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక కోటి సంగీత సారథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఈ యాభై ఏళ్ల సినీ జర్నీని పురస్కరించుకుని మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్ – ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్‌ను నవంబర్ 28న నిర్వహించబోతోంది. ఈ కాన్సర్ట్ ను ఎస్ఎంఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, ఎన్ ఎస్ ఆర్ డెవలపర్స్, నవీన్ గోల్డ్ అండ్ బ్రదర్స్, జీ ఎన్ ఆర్ మయూక ఇన్ ఫ్రా, కాంచీపురం లక్ష్మీ వారాహి సిల్క్స్ గ్రాండ్ గా స్పాన్సర్ చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఈ ఈవెంట్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ,‘నా తండ్రి సాలూరి రాజేశ్వర్ గారికి చెడ్డ పేరు తీసుకు రాకూడదు అని ప్రతీక్షణం ఆలోచిస్తూ పని చేస్తూ వచ్చాను. నేను ప్రతీ సినిమాని, ప్రతీ పాటను మొదటి అవకాశంగానే భావించి కష్టపడి పని చేశాను. తరతరాలు గుర్తుండి పోవాలనే ప్రతీ పాటకు పని చేశాను. రాజ్ కోటిగా ఎన్నో అద్భుతమైన పాటల్ని చేశాం. ఆ తర్వాత కోటిగా నా ప్రయాణంలో గొప్ప గొప్ప పాటల్ని ఇచ్చాను. సంగీత ప్రియుల హృదయాల్లో కోటి పాటలు ఎప్పుడూ నిలిచి ఉంటాయి’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -