Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'జార్జ్ క్రిష్'కథానాయిక..

‘జార్జ్ క్రిష్’కథానాయిక..

- Advertisement -

దర్శకుడు శ్రీను వైట్లతో హీరో శర్వానంద్ తొలిసారి సినిమా చేస్తున్నారు. వీరి కాంబోలో ‘జార్జ్ క్రిష్’ సినిమా పండుగ సీజన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. ఏటీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌ మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ తో సూపర్ హిట్ అందుకున్న మానస వారణాసి ఇందులో శర్వానంద్‌కు జోడీగా కనిపించనున్నారు. టైటిల్ పోస్టర్‌ను బట్టి సినిమాలో లవ్ స్టోరీకి కీలక ప్రాధాన్యత ఉండబోతోంది. మానస పాత్ర కథలో కీలకంగా ఉండనుంది. ఫస్ట్ బూస్టర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -