పెన్ మూవీస్ అధినేత జయంతి లాల్ గడా సమర్పణలో.. ఆర్‌వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ అసోసియేషన్‌లో.. దర్శకుడు రమేష్ వర్మ నుంచి ఐదు భాషల్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ఎపిక్ ‘కర్ణ’. మహాభారతంలోని మహా వీరుడు కర్ణుడి మహాగాథ మరో సారి ఆవిష్కృతం కానుంది. ఈ మహా యోధుడి పాత్రలో నటుడు రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. దర్శకుడు రమేష్ వర్మ తనదైన విజన్‌తో ఈ పురాణగాథను భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రూపొందుతోంది. ఐదు భాషల్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక ఎపిక్.. అత్యున్నత నిర్మాణ విలువలు, భారీ సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. భారీ సెట్స్, అద్భుతమైన వరల్డ్ డిజైన్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్‌తో ‘కర్ణ’ ప్రపంచాన్ని ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో ఆవిష్కరిస్తున్నారు. మహాభారత కాలం నాటి రాజ్యాలు, యుద్ధభూములు, భారీ యుద్ధ సన్నివేశాలు.. ఇలా ప్రతి అంశాన్ని అత్యంత గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. నిజమైన సెట్స్ వైభవానికి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడిస్తూ.. ప్రేక్షకులను కర్ణుడి ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
‘కర్ణ’గా రాఘవ లారెన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



