Thursday, September 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
పబ్బతి లింగయ్యకు నేతల నివాళులు
​నవతెలంగాణ-రామన్నపేట​

​ప్రజల కోసం పనిచేసిన ప్రతి కమ్యూనిస్టూ మరణించాక కూడా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ఉద్యమంలో ఐదు దశాబ్దాలుగా అలుపెరుగని ప్రజా పోరా టాలు సాగించి, అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్య మించిన శోభనాద్రిపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయ కులు, రామన్నపేట మాజీ వైస్ ఎంపీపీ పబ్బతి లింగయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బుధవారం జాన్‌‌వెస్లీ, పార్టీ నాయకులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన సంతాప సభలో జాన్‌ ‌వెస్లీ మాట్లా డుతూ.. పబ్బతి లింగయ్య మరణం పార్టీకి, ప్రజా ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. గీత కార్మిక సంఘం నాయ కుడిగా కల్లుగీత కార్మికులకు చెట్లు అందు బాటులో ఉండాలని, తాడిచెట్లపై పన్నును రద్దు చేయాలని, జీతగాళ్లు, కూలీలను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహిం చారని గుర్తు చేశారు.
ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై నిరంతరం ఉద్యమిం చడమే పబ్బతి లింగయ్యకు మనం అందించే ఘన నివాళి అని ​సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. పబ్బతి లింగయ్య మృతదేహం పాడెను సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం తదితర నాయకులు మోసారు. నివాళులర్పించిన వారిలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, పైళ్ల ఆశయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -