- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : యూపీలోని గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం వేకువజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి మహోబా వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ టూరిస్ట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండటంతో ప్రాణనష్టం పెరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -


