- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ప్రమాదానికి గురైన చిన్నారుల ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా మారింది. చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురి పరిస్థితి విషమించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. రిమ్స్‌లో మరో 15 మంది చిన్నారులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు ముమ్మరం చేశారు.
- Advertisement -



