Thursday, September 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాగల రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

రాగల రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాగల 2 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిద్దిపేట, యాదాద్రి – భోంగీర్, జనగాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లో కూడా విస్తారంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -