Saturday, August 15, 2026
E-PAPER
Homeజాతీయంమహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసు..ప్రధాన నిందితుడు అరెస్ట్

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసు..ప్రధాన నిందితుడు అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మహారాష్ట్ర టెట్ (Teacher Eligibility Test – TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వీరేంద్ర కుమార్ గుప్తాను బీహార్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు తప్పించుకుంటూ వచ్చిన అతడిని ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరేంద్ర కుమార్ గుప్తా కోసం భివండి పోలీసులు చాలా రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఆచూకీ లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని బీహార్‌కు పంపించారు. అక్కడ నిర్వహించిన ఆపరేషన్‌లో అతడిని విజయవంతంగా అరెస్టు చేశారు. ఈ అరెస్టును టెట్ పేపర్ లీక్ కేసులో దర్యాప్తుకు కీలక విజయంగా పోలీసులు భావిస్తున్నారు. అరెస్టు అనంతరం వీరేంద్ర కుమార్ గుప్తాను విమానంలో బీహార్ నుంచి పూణే విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య అతడిని భివండికి తీసుకెళ్లనున్నారు. తదుపరి అతడిని సంబంధిత కోర్టులో హాజరుపరచి పోలీసు కస్టడీ కోరే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -