Monday, December 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, ఎం. దాన కిశోర్‌లకు అపెక్స్ స్కేల్ (లెవల్-17)కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతులు 2026 జనవరి 1 నుంచి లేదా వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పదోన్నతులు, అధికారుల పోస్టింగ్‌లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్‌ను అదే శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా (స్పెషల్ చీఫ్ సెక్రటరీ) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఎల్‌ఈటీ & ఎఫ్ (LET&F) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఎం. దాన కిశోర్‌ను కూడా అదే శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగించనున్నారు. ఈ మేరకు సోమవారం జనరల్ అడ్మినిస్ట్రేషన్ (స్పెషల్-ఏ) శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఈ ఉత్తర్వులను విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -