Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి

- Advertisement -

పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టడం సరి కాదు
అధైర్య పడొద్దు అండగా ఉంటా 
శాసనమండలి మాజీ చైర్మన్  నేతి విద్యాసాగర్
నవతెలంగాణ – కట్టంగూర్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది సర్పంచ్, పాలకవర్గ సభ్యులుగా  బాధ్యతలు స్వీకరించిన వారు రాజకీయాలకు అతీతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడి ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్నారు. సోమవారం మండల కేంద్రమైన కట్టంగూర్, బొల్లేపల్లి, చెరువు అన్నారం గ్రామపంచాయతీ సర్పంచుల, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గత 50 ఏళ్లుగా నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తాను కాపాడుతున్నానని, కమ్యూనిస్టులకు ఎదురొడ్డి అష్ట కష్టాలు పడి కేసులపాలై పార్టీని బ్రతికించామని చెప్పారు.

నాటి నర్రా నుండి మొదలుకొని నేటి ఎమ్మెల్యే వేముల వీరేశం వరకు ఎందరో గెలుపుకు దోహదపడ్డానని చెప్పారు. దీనిని విస్మరించి ప్రస్తుత ఎమ్మెల్యే పాత కాంగ్రెస్ వారిని పట్టించుకోకపోవడం సరి కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు అని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కోసం అవసరమైతే రోడ్డుమీద నిలబడి అయినా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.  కాంగ్రెస్సే  మనం మనమంటేనే కాంగ్రెస్ అన్నట్లుగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కట్టంగూర్,  బొల్లేపల్లి,  చెరువు అన్నారం సర్పంచులు ముక్కామల శ్యామల శేఖర్, వల్లపు వెంకటనారాయణ రెడ్డి, చిలుముల సైదులు, మాజీ ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య , మాజీ జెడ్పిటిసిలు సుంకర బోయిన నర్సింహ్మ యాదవ్, తరాల బలరాములు యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి  దైద రవీందర్, హైకోర్టు న్యాయవాది శేరి చత్రపతి, నాయకులు చెరుకు యాదగిరి, మేడి ఈశ్వరమ్మ, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, పెద్ది బాలనరసింహ, చేగోని జనార్ధన్, కోమటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -