నవతెలంగాణ – కట్టంగూర్
పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు సేవకులుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలమ్మగూడెం, దుగినెల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కష్టపడి పనిచేసి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచులు సుంకరబోయిన సంధ్య వెంకన్న, మల్లబోయిన యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ద సుక్కయ్య, మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి, నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ లు గుండు రాంబాబు డెంకా శంకరయ్య, వనం శ్రీలత, నాయకులు వనం రాంబాబు, పరశనబోయిన అంజయ్య తదితరులు ఉన్నారు.
సర్పంచులు సేవకులుగా పనిచేయాలి: ఎమ్మెల్యే వేముల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



