ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు ఆలేరు కాంగ్రెస్ పార్టీకి: ప్రభుత్వ విప్ ఐలయ్య
నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, రెబల్ గా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు వార్డ్ మెంబర్ల కు అభినందనలు తెలిపే కార్యక్రమం యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్లు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. నవతెలంగాణతో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఆలేరు నియోజవర్గం అత్యధిక స్థానలు సాధించడం పట్ల ఆలేరు నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజవర్గ గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు అభినందన సభ యాదగిరి గుట్టలో మంగళవారం భారీ ప్రజా సమీకరణతో అభినందన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, హాజరవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
నియోజవర్గంలో కాంగ్రెస్ విజయభేరి.. సన్మాన సభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


