Monday, December 22, 2025
E-PAPER
Homeజిల్లాలునూతన సర్పంచ్ లకు పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య సన్మానం

నూతన సర్పంచ్ లకు పీఏసీఎస్ చైర్మన్ మొండయ్య సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులకు సోమవారం ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో తాడిచెర్ల పిఏసిఎస్ తాజా మాజీ ఛైర్మన్ ఇప్ప మొండయ్య శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, వార్డు సభ్యుడు వొన్న తిరుపతి రావు, పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగరావు, ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు కేశవ్, సంధ్య-రవి, అడ్వాలపల్లి వార్డు సభ్యులు, కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతితోపాటు పలువురుని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, జక్కుల వెంకటస్వామి యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -