నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన పవార్ కృప నక్షత్ర ఇటీవల జరిగిన టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించినట్టు ఆర్మూర్ లోని సంత్ జ్ఞానేశ్వర్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ దొండి రవి వర్మ సోమవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ నారాయణ గూడలో జరిగిన తెలంగాణ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏం. ఏల్ . సి శ్రీ డాక్టర్ బల్మూర్ వెంకట్ రావు గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
టైప్ రైటింగ్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



