Monday, December 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ లను అభినందించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి  

సర్పంచ్ లను అభినందించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి  

- Advertisement -

 నవతెలంగాణ – ఆర్మూర్ 
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి  సోమవారం బీజేపీ సర్పంచ్ అభ్యర్థుల ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముల్లంగి గ్రామ సర్పంచ్ అయిన ధర్మపతి ప్రమాణ స్వీకారానికి హాజరై శాలువాతో సన్మానించి మాట్లాడారు. సర్పంచ్ ధర్మపతి గ్రామంలో ఇచ్చిన హామీలు తను నెరవేరుస్తానని బీజేపీ అభ్యర్థులు అధికార పార్టీ కి చెందిన సీనియర్ నాయకులను ఓడించారు అని అన్నారు. కల్లెడ సర్పంచ్ ప్రళయ తేజ సుప్రియ, కంఠం సర్పంచ్ సాయినాథ్,సిద్దాపూర్ సర్పంచ్ మహేశ్, మరంపల్లి సర్పంచ్ గంగాధర్, అన్నారం సర్పంచ్ సంజీవ్ వారి గ్రామాలకు వెళ్లి శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు అందజేసే బాధ్యత సర్పంచులకు  ఉంది అని పార్టీలకు అతీతంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆలూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్,నందిపేట్ మండల అధ్యక్షుడు పటేల్ రాజు,డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -