Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్34 గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవాలు

34 గ్రామ పంచాయతీలో ప్రమాణ స్వీకార మహోత్సవాలు

- Advertisement -

మండల కేంద్రంలో నూతన సర్పంచుకు వెల్లువెత్తిన సన్మానాలు
నవతెలంగాణ – మద్నూర్

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామపంచాయతీలకు నూతన సర్పంచుల పాలకవర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవాలు సోమవారం మద్నూర్, డోంగ్లి, ఇరు మండలాల పరిధిలో మొత్తం 34 పంచాయితీల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారుల ద్వారా నూతన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు అధికారులు ప్రమాణ స్వీకారాలు జరిపించారు. మద్నూర్ మండల కేంద్రం మేజర్ గ్రామపంచాయతీలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రికి ఉపసర్పంచ్ వట్నాల రమేష్ కు వీరితో పాటు 14 మంది వార్డు సభ్యులకు ప్రత్యేక అధికారిగా మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ప్రమాణస్వీకారాలు చేయించారు.

ఈ సందర్భంగా పలువురు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. మేజర్ గ్రామపంచాయతీ అయినందున భారీ ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా వందలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సందీప్ కుమార్ ఏర్పాట్లు చేశారు మద్నూర్ మండలంలోని ఇరవై ఒక్క గ్రామ పంచాయతీలలో సర్పంచులు ప్రమాణ స్వీకారోత్సవాలు చేశారు. అంతాపూర్ పార్వతి బాయి, ఆవల్గావ్ మన్యా బాయి, చిన్న ఎక్లారా మాధవరావు, చిన్న తడుగూర్ సూర్య వంశీ ప్రకాష్, దన్నూర్ జయశ్రీ, గోజేగావ్ భారత్ రాథోడ్, హెచ్ కేలూర్ లక్ష్మణ్, కొడిచర తేజశ్రీ, లచ్చన్ సంజు వోలుగూ, మద్నూర్ ఉష మచ్కూర్ వార్, మేనూర్ అశోక్, పెద్ద ఎక్లారా మహేష్ సోమవార్, రాచూర్ ఆకాష్, రూశేగావ్ సుమన్ బాయి, పెద్ద షక్కర్గా విశాలాక్షి, చిన్న షక్కర్గా దిగంబర్, శాఖాపూర్ తుకారం, సోమూర్ సంగ్రామ్, సుల్తాన్ పేట్ రాజేశ్వర్గౌడ్, పెద్ద తడుగూర్ శాంతాబాయి, తడి ఇప్పర్గా అశ్విని, ఈ విధంగా మద్నూర్ మండలంలో సర్పంచులు ప్రమాణస్వీకారాలు చేశారు.

అదేవిధంగా నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో 13 పంచాయతీలలో ప్రమాణ స్వీకారాలు చేశారు. వారు డోంగ్లి రేఖ, దోతి సంగ్రామ్, ఈలేగావ్ కయే కషాన్ షేక్, ఎనబోరా షేక్ యూనుస్, హసన్ టాక్లి దత్తు, కుర్ల శోభ, లింబూర్ సుజాత, మాదన్ ఇప్పర్గా బాచావార్ లక్ష్మణ్, మల్లాపూర్ శ్రీకాంత్, మారేపల్లి శ్రీధర్ గైక్వాడ్, మోగా హలే బస్వంత్, సిర్పూర్ గజానంద్ పటేల్, పెద్ద టాక్లి అంజన్బాయి లు ప్రమాణ స్వీకారం చేసి, భాద్యతలు తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -