– కోనాపూర్ సర్పంచ్ అరుణ్ రెడ్డి హామీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన రిక్కల అరుణ్ రెడ్డి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన ఐదు సంవత్సరాల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఉన్నత పాఠశాలలను సందర్శించారు. పాఠశాలను సందర్శించిన అరుణ్ రెడ్డికి ప్రధానోపాధ్యాయులు చౌడరపు రాంప్రసాద్, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా తన ఐదు సంవత్సరాల పదవి కాలంలో అందే వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కోనాపూర్ పాఠశాల రికార్డ్ 543 మార్కుల కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల క్యాష్ ప్రైజ్ అందజేస్తానని ప్రకటించారు.
పాఠశాల అభివృద్ధికి ఐదు సంవత్సరాల వేతనం విరాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



