Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అట్టహాసంగా నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం

అట్టహాసంగా నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం

- Advertisement -

 నవతెలంగాణ కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం నూతన సర్పంచుల పదవి శ్రీకర మహోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదిరాయి. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం నూతన సర్పంచులు బాధ్యతలను స్వీకరించారు.ఉప్లూర్ సర్పంచ్ గా ఎనుగందుల శైలేందర్, నాగాపూర్ సర్పంచ్ గా కప్పదండి అశోక్, రాజరాజేశ్వరి నగర్ సర్పంచ్ గా తైద సుశీల సాయన్న, కమ్మర్ పల్లి సర్పంచ్ గా కొత్తపల్లి హారిక అశోక్, హాస కొత్తూర్ సర్పంచ్ గా రేణి గంగాధర్, బషీరాబాద్ సర్పంచ్ గా బైకాన్ జమున మహేష్, కోన సముందర్ సర్పంచ్ గా బెజ్జారం రాకేష్, నర్సాపూర్ సర్పంచ్ గా బుసపురం సంధ్య రాజశేఖర్, ఇనాయత్ నగర్ సర్పంచ్ గా బాణావత్ లలితా రాములు, కొత్తచెరువు తండా సర్పంచ్ గా లకావత్ సంతోష్, అమీర్ నగర్ సర్పంచ్ గా ఊరే నీలవేణి, చౌట్ పల్లి సర్పంచ్ గా మహబూబ్, కోనాపూర్ సర్పంచ్ గా రిక్కల అరుణ్ రెడ్డి సర్పంచులుగా బాధ్యతల్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కు ఉప్లూర్ తక్కురి ముత్యం, రాజరాజేశ్వరి నగర్ ధ్యాగ ప్రసాద్, అమీర్ నగర్ మాలావత్ పద్మ, బషీరాబాద్ చిలువేరి భూమేశ్వర్, చౌట్ పల్లి సట్టా విశాల్, దొమ్మరి చౌడు తండా జరుపుల నరేష్, హాస కొత్తూర్ ఏనుగు మనోహర్, ఇనాయత్ నగర్ మకిలి అనిల్ కుమార్, కమ్మర్ పల్లి కొత్తపల్లి అశోక్, కోనాపూర్ మోర్తాడ్ ఉదయ్, కోన సముందర్ భలేరావ్ శంకర్, కొత్తచెరువు తండా గుగులావత్ రమేష్, నాగాపూర్ ఉల్లెంగుల శశిధర్, నర్సాపూర్ కట్ట రాజ్ కుమార్, పాలకవర్గ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -