Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యాభివృద్దే లక్ష్యంగా సేవలు అందిస్తా

విద్యాభివృద్దే లక్ష్యంగా సేవలు అందిస్తా

- Advertisement -

– హాస కొత్తూర్ సర్పంచ్ నెలిమెల గంగాధర్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఎందరో విద్యావంతులు ఉన్న  గ్రామంలో విద్యాభివృద్ధి లక్ష్యంగా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తానని హాస కొత్తూర్ గ్రామ సర్పంచ్ నెలిమెల గంగాధర్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గా  పదవి భాద్యతలు చేపట్టాక మొదటగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మంచి ఫలితాల సాధాన కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ శ్రీ తో పాటు ఉపాధ్యాయులు సర్పంచ్ గంగాధర్ తో పాటు ఉప సర్పంచ్ మనోహర్,  శ్రీనివాస్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -