Tuesday, December 23, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజలు మెచ్చుకునేలా పాలన చేయాలి: ఎమ్మెల్యే వేముల

ప్రజలు మెచ్చుకునేలా పాలన చేయాలి: ఎమ్మెల్యే వేముల

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గ్రామ పంచాయతీ సర్పంచులుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులు ప్రజలు మెచ్చుకునేలా పాలన చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం వేల్పూర్, కమ్మర్ పల్లి  మండల కేంద్రాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు మొండి అశోక్, కొత్తపల్లి హారిక అశోక్, పాలకవర్గం ప్రమాణ,  పదవి బాధ్యతల స్వీకారణ కార్యక్రమానికి హాజరై  శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా పాలక వర్గం సభ్యులతో ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, అనంతరం పార్టీలకతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని నూతన పాలకవర్గ సభ్యులకు సూచించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి పదవిని అందించారని, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా, పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా బాధ్యతలు నిర్వర్తించాలని కొత్త సర్పంచులకు సూచించారు.

ప్రశాంత్ రెడ్డి బలపరిచిన వ్యక్తులుగా గెలిచిన మీరు తనకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరించొద్దని అన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అందరిని సమానంగా చూడాలన్నారు. గ్రామాన్ని అందంగా ఉంచేందుకు, రోడ్లు, మురికి కాలువలు శుభ్రంగా ఉంచేందుకు సమయాన్ని కేటాయించి బాధ్యతగా మెలగాలన్నారు. గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ తోడుగా నిలవాలని నూతన సర్పంచులకు, పాలకవర్గ సభ్యులకు సూచించారు. ఎమ్మెల్యే సమక్షంలో వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్, కమ్మర్ పల్లి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ బాధ్యతలు స్వీకరించగా వారిని ఎమ్మెల్యే అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -