Tuesday, December 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
మండలంలోని వాడియాల గ్రామ సర్పంచ్ చంద్రయ్య గౌడ్  పదవి బాధ్యతలు చేపట్టడంతో సోమవారం గౌడ్ సంఘం ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా సర్పంచ్ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని నా గెలుపుకు గౌడ్ సంఘం అంతా ఏకమై పనిచేసినందుకు వారికి ఎల్లప్పుడూ రుణపడి  ఉంటానని  అన్నారు. గ్రామ అభివృద్ధిలో కూడా యువకులు ముందుకు రావాలని కోరారు. ప్రజల సహకారంతో రాజకీయాలకతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. నాపై నమ్మకం ఉంచి  ప్రజలందరూ నాకు ఓటు వేసి గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సాయిలు గౌడ్, సురేందర్ గౌడ్, వెంకటయ్య గౌడ్, తిరుపతయ్య గౌడ్, శివ గౌడ్, వినోద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -