Wednesday, May 21, 2025
Homeఆదిలాబాద్అభ్యాస సామర్థ్యాల పెంపునకే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ...

అభ్యాస సామర్థ్యాల పెంపునకే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ…

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరచడానికే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కోర్సు డైరెక్టర్ ఎంఈఓ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం జన్నారంలోని బాలికల జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులలో కనీస అభ్యసన సామర్ధ్యాలని మరింత మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు.  ఈ శిక్షణ కార్యక్రమాన్ని, జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పిట్టల రాజారావు జాజాల శ్రీనివాస్ సాత్పడి నరసయ్య శెట్టిపల్లి వామన్ కుమార్ కస్తూరి శ్రీకాంత్ శ్రీధర్ సీమల శ్రీనివాస్ ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులందరూ అన్ని అంశాలను విపులంగా నేర్చుకొని రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ చక్కగా చదివేటట్లుగా రాసేటట్లుగా చేయాలని కోరారు. ఈ శిక్షణ కార్యక్రమం ఉదయం 9:30 కు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. శిక్షణ పొందే ఉపాధ్యాయులు తప్పకుండా సమయపాలన పాటించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -