Tuesday, December 23, 2025
E-PAPER
Homeఆటలువిజయ్‌ హజారే ట్రోఫీ బరిలో గిల్‌, అభిషేక్‌, అర్ష్‌దీప్‌

విజయ్‌ హజారే ట్రోఫీ బరిలో గిల్‌, అభిషేక్‌, అర్ష్‌దీప్‌

- Advertisement -

చండీగఢ్‌ : విజయ్‌ హజారే టోర్నీ టీమిండియా స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడనుంది. ఇప్పటికే ఢిల్లీ తరఫున విరాట్‌ కోహ్లి, ముంబయి తరఫున రోహిత్‌ శర్మ బరిలో దిగుతుండగా.. తాజాగా పంజాబ్‌ జట్టు ప్రకటించిన 18 మంది ఆటగాళ్ల జాబితాలో శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ చోటు దక్కించుకున్నారు. పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సోమవారం ప్రకటించిన జట్టులో వీరికి చోటు లభించింది. వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు నమన్‌ ధీర్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, సన్వీర్‌ సింగ్‌ను ఎంపిక చేశారు.

అయితే, కెప్టెన్‌ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. పంజాబ్‌ తమ ఏడు లీగ్‌ దశ మ్యాచ్‌లను జైపూర్‌లో ఆడనుంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, గోవా, ముంబయితో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు జనవరి 8న ముగుస్తాయి. జనవరి 11 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో గిల్‌, అభిషేక్‌, అర్ష్‌దీప్‌ ఎంపికైతే.. విజరు హజారే ట్రోఫీకి వారు ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారో చూడాలి.

పంజాబ్‌ జట్టు: శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(వికెట్‌కీపర్‌), హర్నూర్‌ పన్ను, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, ఉదయ్‌ సహారాన్‌, నమన్‌ ధీర్‌, సలీల్‌ అరోరా, సన్వీర్‌ సింగ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, జషన్‌ప్రీత్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రఘు శర్మ, క్రిష్‌ భగత్‌, గౌరవ్‌ చౌదరి, సుఖదీప్‌ బజ్వా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -