Tuesday, December 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅద్భుత అంశాలతో 'దీక్ష'

అద్భుత అంశాలతో ‘దీక్ష’

- Advertisement -

ఆర్‌ కె ఫిలిమ్స్‌, సిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ నిర్మాణ, దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ఆర్‌కె దీక్ష’. బిఎస్‌ రెడ్డి సమర్పణలో ఢీ జోడి ఫేమ్‌ అక్స ఖాన్‌, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్‌గా, కిరణ్‌ హీరోగా నటించారు. త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి సోమవారం నూతన పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్‌ 50 సంవత్సరాల క్రితం చేసిన ‘దీక్ష’ అనే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో జవాన్లపై ఒక పాట ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఎన్నో అద్భుతమైన అంశాలు ఉంటాయి. నటీనటులకు మంచి పేరు వస్తుంది’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో నటీనటులు ఎంతో బాగా నటించారు. మనిషికి ఉండే పట్టుదల, భక్తి వంటి అంశాలను తీసుకుని చేశారు’ అని సమర్పకులు డి.ఎస్‌.రెడ్డి చెప్పారు.

తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్‌ సినిమా పేరును తీసుకుని ఆయన ఆశయాలతో ఈ సినిమాను తీశారు. అటువంటి గొప్ప ఆలోచనతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నటి అక్సా ఖాన్‌ ఈ చిత్ర ప్రమోషన్స్‌లో ఉత్సాహంగా పాల్గొనడం హర్షించదగిన విషయం. ప్రస్తుతం చిన్న సినిమాల మనుగడకు చాలా కష్టంగా ఉంది. దాసరి నారాయణరావు చిన్న సినిమాలకు సపోర్ట్‌ చేస్తూ, టికెట్‌ ధరలు తక్కువలో ఉండాలని కోరుకునేవాళ్ళు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే పెరిగిన డిజిటల్‌ ధరలతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రామకృష్ణ ఇటువంటి పరిస్థితులలో కూడా సినిమాలు చేయడం అభినందించదగిన విషయం’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -