Tuesday, December 23, 2025
E-PAPER
Homeసినిమా'రౌడీ జనార్థన'గా విజయ్ దేవరకొండ

‘రౌడీ జనార్థన’గా విజయ్ దేవరకొండ

- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్న నూతన చిత్రం ‘రౌడీ జనార్థన’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. రవి కిరణ్‌ కోలా దర్శకుడు. రూరల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంతో భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను సోమవారం విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్‌గా రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో ప్రొడక్షన్‌ డిజైనర్‌ డినో శంకర్‌, డీవోపీ ఆనంద్‌ సి చంద్రన్‌ పాల్గొన్నారు. డైరెక్టర్‌ రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ, ‘మీ అందరి లాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. రౌడీ జనార్థన టైటిల్‌ మీకు నచ్చిందని అనుకుంటున్నా. రౌడీ జనార్థన ఎలా ఉంటాడో పరిచయం చేసి, ఆ తర్వాత టైటిల్‌ రివీల్‌ చేయాలని అనుకున్నాం. కానీ టైటిల్‌ మీకు తెలిసిపోయింది. సినిమా అనుకున్నది అనుకున్నట్లుగా వస్తోంది.

ఇందులో ఈస్ట్‌ గోదావరి యాసలో విజయ్ చాలా యాక్యురేట్‌గా డైలాగ్స్‌ చెబుతున్నారు’ అని అన్నారు. ‘విజయ్ దేవరకొండ డిఫరెంట్‌ మూవీస్‌ చేస్తూ వచ్చాడు. కానీ తొలిసారిగా ఈ మూవీలో ఆంధ్రలోని ఈస్ట్‌ గోదావరి యాసలో మాట్లాడిస్తున్నాం. విజయ్ పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం వంటి యూత్‌ ఫుల్‌ మూవీస్‌ చేశాడు. కానీ ఇప్పటిదాకా ఇంత మాస్‌, బ్లడ్‌ షెడ్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయలేదు. అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ క్యారెక్టర్‌లో విజయ్ కనిపించబోతున్నాడు. 80 దశకం బ్యాక్‌ డ్రాప్‌లోని వరల్డ్‌ను క్రియేట్‌ చేశారు. మీ అందరినీ అలరించేందుకు నెక్ట్స్‌ ఇయర్‌ రిలీజ్‌కు తీసుకొస్తాం. ఈసినిమాతో కొత్త విజయ్ ని చూడబోతున్నారు’ అని ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు చెప్పారు. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్‌ జంటగా నటిస్తున్న ఈచిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ – డినో శంకర్‌, డీవోపీ – ఆనంద్‌ సి చంద్రన్‌, ప్రొడ్యూసర్స్‌ – దిల్‌ రాజు, శిరీష్‌, స్టోరీ – డైరెక్షన్‌ – రవికిరణ్‌ కోలా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -