– 71,387 మందికి ప్రయోజనం
– విద్యుత్ సంస్థలపై ప్రతి నెలా రూ.9.30 కోట్ల అదనపు భారం
– ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆమోదం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ ఉద్యోగులకు 17.65 శాతం డీఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచీ ఆధారంగా ప్రతి సంవత్సరం డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) డియర్‌నెస్ రిలీఫ్(డీఆర్)ను సమీక్షిస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది 1జులై 2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టీజన్లకు డీఏ, డీఆర్‌ను ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలో పని చేస్తున్న 71,387 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్‌కోలో పని చేస్తున్న 3,036 మంది ఉద్యోగులు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ జెన్కోకు చెందిన 14,075 మంది లబ్ది పొందుతారు. ఇందులో 6,913 ఉద్యోగులు, 3,583 మంది ఆర్టిజన్లు, 3,579 మంది పెన్షనర్లు ఉన్నారు. ఎస్పీడీసీఎల్‌లో 11,957 మంది ఉద్యోగులు, 8,552 మంది ఆర్టిజన్లు, 8,244 మంది పెన్షనర్లకు మొత్తంగా 28,753 లబ్ది చేకూరనుంది. ఎన్సీపీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులు, 3,465 మంది ఆర్టిజన్లు, 6,115 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
విద్యుత్ ఉద్యోగులకు 17.65 శాతం డీఏ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



