వాషింగ్టన్ : ట్రంప్ ప్రభుత్వం సుమారు 30 మంది కెరీర్ దౌత్యవేత్తలను రాయబార, ఇతర ఎంబసీ సీనియర్ పోస్టుల నుంచి తొలగించింది. కెరీర్ దౌత్యవేత్తలంటే విదేశీ సర్వీసుకు అంకితమైన ప్రభుత్వోద్యోగి. విదేశాలలో దేశ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఎంబసీలు, కాన్సులేట్లలో దీర్ఘకాలిక పోస్టింగ్స్‌లో ఉంటారు. వీరు రాయబారుల వంటి తాత్కాలిక రాజకీయ నియమితులు కారు. అలాంటి ఎంతో ప్రాధాన్యత కలిగిన కెరీర్ దౌత్యవేత్తలకు ట్రంప్ ఉద్వాసన పలికారు. విదేశాలలో పనిచేస్తున్న అమెరికా దౌత్యవేత్తల వ్యవస్థను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ ప్రాధాన్యతలకు పూర్తి మద్దతు ఇచ్చే సిబ్బందినే నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతా బైడెన్ హయాంలో నియమితులైన వారే
జనవరిలో పదవీకాలం పూర్తవుతుందని కనీసం 29 దేశాలలోని కెరీర్ దౌత్యవేత్తలకు గత వారమే సమాచారం పంపారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. వీరందరూ బైడెన్ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే.
ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆగ్రహానికి గురికాకుండా తప్పించుకున్నారు. రాజకీయ నియామకాలపై దృష్టి సారించిన ట్రంప్ వీరిని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే వీరికి గత వారమే ఉద్వాసన నోటీసులు అందాయి. కెరీర్ దౌత్యవేత్తలు విదేశీ సర్వీసు ఉద్యోగాలను కోల్పోయినప్పటికీ వారు తిరిగి వాషింగ్టన్ చేరుకొని ఇతర బాధ్యతలు చేపడతారు. కచ్చితంగా ఎంతమంది కెరీర్ దౌత్యవేత్తలను తొలగించారో చెప్పేందుకు విదేశాంగ శాఖ నిరాకరించింది. అయితే ప్రభుత్వం తలపెట్టిన మార్పులను సమర్ధించింది.
తొలగింపులు ఇలా…
కాగా తొలగింపుల ప్రభావం ఆఫ్రికా దేశాలపై ఎక్కువగా పడబోతోంది. ఆ ప్రాంతంలోని 13 దేశాల దౌత్యవేత్తలను తొలగిస్తున్నారు. ఆరు ఆసియా దేశాలలో పనిచేస్తున్న దౌత్యవేత్తలకు కూడా ఉద్వాసన తప్పడం లేదు. యూరప్‌లోని నాలుగు దేశాలు, మధ్యప్రాచ్యం, దక్షిణ-మధ్య ఆసియా, పశ్చిమార్థగోళంలోని రెండేసి దేశాలలో పనిచేస్తున్న కెరీర్ దౌత్యవేత్తలు కూడా బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
కెరీర్ దౌత్యవేత్తలకు ట్రంప్ ఉద్వాసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



