– పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసుల సోదాలు
నవతెలంగాణ – మియాపూర్
రంగారెడ్డి జిల్లా రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధి అంజయ్యనగర్‌లోని కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ దందా మరోసారి వెలుగు చూసింది. కో లివ్ గెర్నట్ పీజీలో ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం డ్రగ్స్ పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కో లివింగ్ హాస్టల్లో డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే హాస్టల్‌పై దాడి చేశారు. ఏపీకి చెందిన వంశీ దిలీప్, బాల ప్రకాశ్.. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీరు హైదరాబాద్‌కు చెందిన రోహిత్, తరుణ్‌కు విక్రయించారు. ఈ క్రమంలో డ్రగ్స్ దందా సాగుతున్నట్టు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు హాస్టల్‌పై దాడి చేసి మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 12 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల ఓజీ కుష్, 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. న్యూ ఈయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ పట్టివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



