– ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండేకార్ యాదిలాల్
– ఆమనగల్ నుంచి చలో సెక్రెటేరియట్ పాదయాత్ర
– అయ్యసాగర్ క్షేత్రం వద్ద అడ్డుకున్న పోలీసులు
నవతెలంగాణ-ఆమనగల్
న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ఆమనగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అండే కార్ యాదిలాల్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలోని జూనియర్ కోర్టు ఆవరణలో చలో సెక్రెటేరియట్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు హనుమంత్ రెడ్డి, ఫణీంద్ర భార్గవ్, రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి కార్తీక్ పాదయాత్రను ప్రారంభించి మాట్లాడారు. న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా చాలామంది న్యాయవాదులు దాడులకు గురవుతున్నారని తెలిపారు. అంతేకాక కొన్ని ప్రాంతాల్లో దుండగుల చేతుల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నట్టు చెప్పారు. న్యాయవాదులతోపాటు వారి కుటుంబాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ అధ్యక్షులు వేణుగోపాలరావు, మహేశ్వరం అధ్యక్షులు హరికిషన్‌గౌడ్, కార్యదర్శి సుభాష్ రెడ్డి, ఖుషి ఫౌండేషన్ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది మడుపు శశికాంత్, ఆమనగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుడ్డు ఆంజనేయులుయాదవ్, ఉపాధ్యక్షులు ఏర్పుల రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి విజరు కుమార్, కోశాధికారి కొప్పు కృష్ణ, వివిధ ప్రాంతాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు.
పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు..
ఆమనగల్ పట్టణం నుంచి హైదరాబాద్ వరకు చలో సెక్రెటేరియట్ న్యాయవాదులు నిర్వహిస్తున్న పాదయాత్రను స్థానిక ఎస్‌ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. మండలంలోని అయ్యసాగర్ క్షేత్రం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి, అనంతరం విడుదల చేశారు.
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



