Tuesday, December 23, 2025
E-PAPER
Homeబీజినెస్వడ్డీ రేట్లు మరో పావు శాతం తగ్గొచ్చు

వడ్డీ రేట్లు మరో పావు శాతం తగ్గొచ్చు

- Advertisement -

– యూనియన్‌ బ్యాంక్‌ అంచనా
న్యూఢిల్లీ :
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) 2026 ఫిబ్రవరిలో నిర్వహించనున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేసింది. రెపో రేటును మరో 0.25 శాతం తగ్గించి 5.0 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. డిసెంబర్‌లో నిర్వహించిన సమీక్షలో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి రెపోరేటును 5.25 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ధరల పెరుగుదల ఒత్తిడి తక్కువగా ఉండటంతో వడ్డీ రేట్లకు మరోమారు తగ్గుదలకు అవకాశం ఉందని వివరించింది. తదుపరి ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం 2026 ఫిబ్రవరి 4, 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ భేటీలో వడ్డీ రేట్లను తగ్గిస్తే గృహ, వాహన, రిటైల్‌ రుణాలు మరింత చౌకగా మారొచ్చని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -