నవతెలంగాణ – డిచ్ పల్లి
డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 2025 ఉత్సవ కమిటీ చైర్మన్ ఇటుక రాజు నాయకత్వంలో బాబు జగ్జీవన్ రామ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి ఇరువురి సేవ దృక్పథానికి అంకితమై షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఎడవెల్లి సోమనాథ్ కు ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా సికింద్రాబాద్ లోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో దళిత రత్న అవార్డును ప్రధానం చేశారు. అవార్డు గ్రహీత సోమనాథ్ మాట్లాడుతూ పూలే ,అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడుస్తూ అణగారిన ప్రజలకు సేవ చేస్తూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాటంలో ముందుంటానని ,ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందిని, అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడే బాధ్యత ఇకా నుండి ఎక్కువైందని ,నా జాతి పోరాటంలో అధిక శాతం ఎక్కువ సంఖ్యలో పాల్గొంటానని, ఈ అవార్డు కోసం నా పేరు ప్రతిపాదించి తీర్మానాన్ని చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాట్లు సోమ్ నాథ్ పేర్కొన్నారు.దర్మారం బి గ్రామానికి చెందిన ఎడవెల్లి సోమ్ నాథ్ కు దళిత రత్న అవార్డును రావడంతో దళితులు హర్షం వ్యక్తం చేశారు.మున్ముందు ఇంకా ఉన్నత పదవులు, అవార్డులు పోందుతు శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జన్ను , కనకరాజు, మేరీ శివ తదితరులు పాల్గొన్నారు.
ఎడవెల్లి సోమనాథ్ కు దళిత రత్న అవార్డు ప్రధానం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES