- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్పంచులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘సర్పంచ్‌లుగా, ఉప సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
- Advertisement -



