Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యతపై శిక్షణ..

ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యతపై శిక్షణ..

- Advertisement -
  • – మండల విద్యాశాఖ అధికారి కట్టా ఆంజనేయులు…!
    నవతెలంగాణ – రెంజల్
  • ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్యత అభివృద్ధిపై ఐదు రోజులు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు మంగళవారం ప్రారంభించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఈ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డి ఆర్ పి లు చెబుతున్న విషయాలను ఉపాధ్యా యులు శ్రద్ధతో విని నేర్చుకొని రోజువారి బోధనలో విద్యార్థులకు బోధించి విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. శిక్షణ కార్యక్రమం లో ఉపాధ్యాయులు శ్రద్ధగా విని ముద్దుల భవిష్యత్తును తీర్చి దిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో  పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శి టి సోమలింగం గౌడ్, కిషోర్ కుమార్, డిఆర్పీలు శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, నరేందర్ శేఖర్, మయూరి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -