సమన్వయ సమావేశంలో సబ్ కలెక్టర్, డిఎస్పి
నవతెలంగాణ – మిర్యాలగూడ
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిఎస్పి రాజశేఖర్ రాజు కోరారు. మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై నియోజవర్గ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 24న బుధవారం స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.క్రిస్మస్ వేడుకలను శాంతియుతంగా, సౌహార్దపూర్వకంగా నిర్వహిస్తూ ప్రజా శాంతిభద్రతలను కాపాడాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అన్ని క్రిస్మస్ వేడుకలు, ప్రార్థనలు, విందులు, ఊరేగింపులు సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా నిర్వహించాలన్నారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల ద్వారా మంజూరు చేయబడిన అనుమతులను కచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమ స్థలాల్లో జన సమూహ నియంత్రణ, పార్కింగ్, పారిశుధ్యం, అగ్నిమాపక భద్రతకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఏ ఓ శ్రీనివాస్ శర్మ తహసిల్దార్ లు ఎంపీడీవోలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



