- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సాధారణంగా వేడి వాతావరణానికి, ఇసుక తిన్నెలకు పెట్టింది పేరైన సౌదీ అరేబియాలో గత 30 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మంచు కురుస్తోంది. ఉత్తర ప్రాంతాలైన తబుక్, ఆల్ జాఫ్, హైల్ లో దట్టంగా కురుస్తున్న మంచుతో జబల్ ఆల్ లౌజ్ పర్వతం హిమాలయ శిఖరంలా మారింది. వాతావరణ మార్పుల వల్ల అరేబియా సముద్రంలో అల్పపీడన ద్రోణి, ఉత్తరం నుంచి వచ్చే చల్లటి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు -4 డిగ్రీలకు పడిపోవడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేవలం సౌదీలోనే కాదు, దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లోనూ ఇలాంటి విచిత్ర వాతావరణం కనిపిస్తోంది.
- Advertisement -



