Tuesday, December 23, 2025
E-PAPER
Homeఆటలుగవాస్కర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట...

గవాస్కర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో మంగళవారం భారీ ఊరట లభించింది. గవాస్కర్ వ్యక్తిగత, ప్రచార హక్కులను పరిరక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. గవాస్కర్ పేరు, ఫోటో, ప్రతిష్ఠను దుర్వినియోగం చేస్తూ ఆన్‌లైన్‌లో ఉన్న అనధికారిక కంటెంట్, వస్తువులను వెంటనే తొలగించాలని సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను ఆదేశించింది.

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. గవాస్కర్‌పై తప్పుడు వ్యాఖ్యలను ఆపాదిస్తూ ప్రచారంలో ఉన్న యూఆర్‌ఎల్‌లను 72 గంటల్లోగా తొలగించాలని మెటా, ఎక్స్ కార్ప్ వంటి సంస్థలను ఆదేశించింది. ఒకవేళ యూజర్లు ఆ కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైతే, సంబంధిత సోషల్ మీడియా సంస్థలే వాటిని నిలిపివేయాలని స్పష్టం చేసింది. అలాగే, గవాస్కర్ పేరుతో అనధికారికంగా విక్రయిస్తున్న నకిలీ ఆటోగ్రాఫ్‌లు, ఇతర వస్తువుల లిస్టింగ్‌లను కూడా తొలగించాలని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు సూచించింది. సోషల్ మీడియాలో కొందరు తనకు సంబంధం లేని వ్యాఖ్యలను ఆపాదిస్తున్నారని, ఆన్‌లైన్‌లో తన పేరుతో నకిలీ వస్తువులను అమ్ముతున్నారని ఆరోపిస్తూ సునీల్ గవాస్కర్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పై విధంగా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -